విశాఖ తూర్పు నియోజకవర్గంలో జనసేన చలివేంద్రం

విశాఖ ఉదయం, 20 వ వార్డ్ విశాఖ తూర్పు నియోజకవర్గం విశాఖ ఐ హాస్పిటల్ దగ్గర ఉన్న జివిఎంసి స్కూల్ వద్ద చలివేంద్రం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన వీర మహిళలకు మరియు జనసైనికులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని విశాఖ తూర్పు నియోజకవర్గం 20 వ వార్డు వీర మహిళ సారని దేవి అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.