పి.వేమవరం ఘటనపై జనసేన పిర్యాదు

సామర్లకోట మండలం, పి.వేమవరం సచ్చివాలయంలో వైసీపీ నాయకులు జనసేన కార్యకర్తలపై దాడికి పాల్పడడం, దాడి ఘటనలో జనసేన కార్యకర్తలకు గాయాలు కావడంతో సామర్లకోట పోలీస్ స్టేషన్ లో పెద్దాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ తుమ్మల రామస్వామి (బాబు) పిర్యాదు చేశారు. ఈ సందర్బముగా బాబు మాట్లాడుతూ దాడికి పాల్పడిన వైసిపి నాయకులపై వారిపై కేసు నమోదు చేసి దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని పిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పిట్టా జానకి రామారావు సామర్లకోట పట్టణ అధ్యక్షులు సరోజ వాసు, తోట సాయి మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.