శాశ్వత అంగన్వాడి భవనాలు నిర్మించాలని జనసేన డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, ములకలపల్లి మండల వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడి సెంటర్లకు శాశ్వత భవనాలు లేవు అని జనసేన పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్ దృష్టికి రావడంతో రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్ మరియు విద్యార్థి రాష్ట్ర అధ్యక్షులు సంపత్ నాయక్ మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ రామ్ తాళ్ళురి ఆదేశాలతో మండలంలో ఉన్న జిల్లా నాయకులు మరియు జనసేన కార్యకర్తలతో సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడి సెంటర్లకు ఐసిడిసి నుంచి అన్ని విధాలుగా నిధులు అందుతున్న ప్రభుత్వం నుంచి శాశ్వత భవనాలు లేక అద్దె భవనాలలో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని అంగన్వాడి సెంటర్లకు కరెంటు నీటి సమస్యలు ఉన్నాయని తెలియపరచడం జరిగింది. అద్దె భవనాలకు అద్దె చెల్లించడంలో సకాల సమయంలో అందడం లేదని జాప్యం జరుగుతుందని తద్వారా తమ సొంత నిధులతో నిర్వహిస్తున్నామని తెలియపరచడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్ మాట్లాడుతూ శుక్రవారం మండల వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అంగన్వాడి సెంటర్లలకు శాశ్వత భవనాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎన్నో ప్రభుత్వాలు మారినా అంగన్వాడి సెంటర్లకు శాశ్వత భవనాలు కల్పించడంలో విఫలమయ్యాయని కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత అయినా అంగన్వాడీ సెంటర్లకు శాశ్వత భవనాలు నిర్మిస్తారని ఎన్నో ఆశలతో ఉన్నటువంటి టీచర్లకు నిరాశ ఎదురయిందని ఇకనైనా అంగన్వాడి శాశ్వత భవనాలు నిర్మించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి మరియు యువజన విభాగం నాయకులు గొల్ల వీరభద్రం, గరికె రాంబాబు జనసేన నాయకులు బొలగాని పవన్ కళ్యాణ్, నక్కన రమేష్, నగరికంటి రాము, తొర్లికుంట ప్రసాద్, పద్దం శివ, జల్లారపు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.