నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన అభివృద్ధిపై చ‌ర్చ‌కు సిద్ద‌మా?

  • అధికార పార్టీ నాయ‌కుల దోపిడితో ప్ర‌జ‌ల ఇబ్బందులు
  • గుంటూరు ఘ‌ట‌నతో మున్సిప‌ల్ అధికారులు ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోవాలి
  • జ‌న‌సేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజీ

చిల‌క‌లూరిపేట‌: చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో వేలాది కోట్ల రూపాయాల అభివృద్ధి జ‌రిగింద‌ని, ఈ అభివృద్దిని చూసే ఓట్లు వేయాల‌ని ఊద‌ర గొడుతున్న అధికార పార్టీ నాయ‌కులు ….జ‌రిగిన అభివృద్దిపై బ‌హిరంగ చ‌ర్చకు సిద్ద‌మా అని జ‌న‌సేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో -కన్వీనర్ పెంటేల బాలాజీ స‌వాలు విసిరారు. శ‌నివారం ఆయ‌న కార్యాల‌యంలో విలేక‌ర్ల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ చిల‌క‌లూరిపేట నియోజ‌కవ‌ర్గం ఎన్న‌డూ లేని విధంగా ఐదేళ్ల కాలంలో తీవ్ర దోపిడికి గురైంద‌ని ఆరోపించారు. అధికార‌పార్టీ నాయ‌కులు స‌హ‌జ‌వ‌న‌రురులను అందిన కాడికి దోచుకున్నార‌ని విమ‌ర్శించారు. ప్ర‌తి ప‌నిలో అవినీతి పెరిగి పోయింద‌ని, క‌మీష‌న్లు ఇవ్వ‌లేక కాంట్రాక్ట‌ర్లు ప‌నులు మానేసిన వెళ్లి పోయార‌ని గుర్తు చేశారు. చేసిన ప‌నుల‌కు బిల్లులు రాక అభివృద్ది కుంటుప‌డింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌ల‌కు ఆరునెల‌ల ముందే కాడి వ‌దిలేసి, చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి విడ‌ద‌ల ర‌జిని చిల‌క‌లూరిపేట ప్ర‌జ‌ల‌ను వ‌ద‌లి గుంటూరుకు వెళ్లి పోయార‌ని ఆరోపించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఎన్నో హామీలు ఇచ్చి వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింద‌ని, ఎన్నిక‌ల అనంత‌రం వాటిని అమ‌లు చేయ‌లేక చ‌తికిల ప‌డ్డార‌ని ఎద్దెవా చేశారు. మ‌ద్య‌పాన నిషేదం ఏది?
మ‌ద్య పాన నిషేదం అమ‌లు చేసే తిరిగి ఓట్లు అడుగుతామ‌న్న వైసీపీ నేత‌లు తిరిగి ఏ మెహం పెట్టుకొని ఓట్లు అడ‌గ‌టానికి వ‌స్తున్నార‌ని మండిప‌డ్డారు. చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో మ‌ద్యం దుకాణాల‌న్ని అధికార పార్టీకి చెందిన వారే స్వాధీనం చేసుకొని, వాటి మ‌నుగ‌డ కోసం ప్ర‌భుత్వానికి అదాయం వ‌చ్చే మ‌ద్యం దుకాణాల‌ను సైతం ఊరిబ‌య‌ట‌కు త‌ర‌మివేశార‌ని ఆరోపించారు. మ‌ద్యం, రేష‌న్, గ్రావెల్ మాఫియాలు నియోజ‌క‌వ‌ర్గంలో విజృబించి ప్ర‌జా కంట‌కులుగా మారార‌ని, శాంతి భ‌ద్ర‌త‌ల‌కు తీవ్ర విఘాతం క‌లిగిస్తున్నా అధికారులు సైతం ప‌ట్టించుకోలేద‌న్నారు. ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోవాలి విష‌జ్వ‌రాలు, డెంగీ ల‌క్ష‌ణాల జ్వ‌రాల‌తో ప్ర‌జ‌లు అల‌మ‌టిస్తున్నార‌ని, అధికారులు అల‌స‌త్యం వీడి ప్ర‌జారోగ్యంపై దృష్టి పెట్టాల‌ని హిత‌వు ప‌లికారు. గ్రామాల్లోనూ, ప‌ట్టణంలోనూ పారిశుధ్యం అడుగంటింద‌ని ఆరోపించారు. ప‌ట్ట‌ణంలో దోమ‌లు వ్యాప్తి చెందుతున్నా క‌నీసం ఫాగింగ్ కూడా చేయ‌టం లేద‌న్నారు. ఒక వైపు గుంటూరు న‌గ‌రంలో క‌లుషిత నీరు తాగి ప్ర‌జ‌ల ప్రాణాలు కోల్ప‌తుంటే మున్సిపాలిటీ ప‌రిధిలో అధికారులు , పాలకులు ఉదాసీనత వీడి ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు.