తక్షణమే మైనర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని జనసేన డిమాండ్

ఇచ్ఛాపురం నియోజకవర్గం, డొంకూరు గ్రామం, డొంకూరు మరియు బూర్జపాడు మద్య ఉన్న వంతెన గత కొన్ని సంవత్సరాలుగా శిథిలావస్థకు చేరుకుంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. గత మూడు రోజులు నుండి వంతెన దిగువ నుండి వెళ్తున్న నీరు వంతెన పైకి చేరి, మోకాళ్ళ ఎత్తు వరకు వస్తుంది. చుట్టూ ప్రక్కల ప్రాంతాల వారికి, వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని డొంకూరు, బూర్జపాడు గ్రామ జనసైనికులు నియోజకవర్గ నాయకులు దృష్టికి తీసుకెళ్లగా, గురువారం జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తిప్పన దుర్యోధన రెడ్డి, రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా వంతెన వద్దకు వెళ్లి సందర్శించారు. అక్కడ పరిస్థితిని చూసి తిప్పన దుర్యోధన రెడ్డి మాట్లాడుతూ… స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్నాం కానీ సామాన్యుల కష్టాలు మాత్రం తీరడం లేదు. ఓట్లు వేసి గెలిపించిన ప్రభుత్వాలు ప్రజల సమస్యలు పట్టించుకోవడంలేదు. శిధిలావస్థకు చేరిన వంతెనకు నిధులు మంజూరు అయినా ఇంకా పనుల్లో జాప్యం ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే మైనర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు. హరి బెహరా మాట్లాడుతూ ఈ వంతెన విషయం గ్రామస్తులు టీడీపీ, వైసీపీ నాయకులు దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. అని మత్స్యకార గ్రామాలకు ప్రభుత్వాలు ఓటర్లు గానే చూస్తున్నారు కానీ, ఇక్కడ ప్రజల సమస్యలు పరిష్కారం చేయట్లేదని అన్నారు. ఇచ్ఛాపురం జనసేన ఇంఛార్జి దాసరి రాజు మాట్లాడుతూ రాష్ట్రానికి చివరి మత్స్యకార గ్రామమైన సాగర తీర ప్రాంతం డొంకూరు పెద్ద లక్ష్మీపురం, కృష్ణాపురం చీకటి ప్రపంచాన్ని తలపించే ఈ గ్రామాలు. అక్కడ వారు బాహ్య ప్రపంచాన్ని చూడాలంటే బలహీనంగా ఉన్న ఉప్పుటేరు వంతెన కాజ్ వే లను దాటి రావాలి. 18 ఏళ్ల క్రిందట నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరింది. అప్పటి ప్రభుత్వం కాజ్ వే రూ 5 కోట్లు మంజూరు చేయగా కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో పనులు నిలిచిపోయాయి. కొత్త ప్రభుత్వంలో కాజ్ వే కు 9 కోట్లు వంతెనకు 5.20 కోట్లు మంజూరు చేశారు. అయినప్పటికీ కాగితాలు వరకే పరిమితం చేశారు. వైయస్సార్సీపి ప్రభుత్వం ప్రజా సమస్యలు వాళ్ళకి పట్టడంలేదు ఇకనైనా ప్రజా సమస్యల అర్థం చేసుకొని వెంటనే కాజ్ వే నిర్మించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. వంతెన వద్దకు వెళ్లి సందర్శించిన వారిలో జనసేన నాయకులుతో పాటు ఇచ్ఛాపురం మున్సిపాలిటీ ఇంఛార్జి 10వ రోకళ్ళ భాస్కర్, బడే దేవరాజు, మాధవ్ రెడ్డి, ధనుంజయ మరియు డొంకూరు, బూర్జిపాడు గ్రామ జనసైనికులు కోడ జానకిరావు, సంతోష్, కృష్ణ, మోహన్, చిరు, నీలాద్రి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.