యూ1 రిజర్వడ్ జోన్ ను రద్దు చేయాలని జనసేన డిమాండ్

జనసేన పార్టీ తాడేపల్లి మండలం అధ్యక్షులు సామల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం తాడేపల్లి మండల కుంచనపల్లి, కొలనుకొండ పరిధిలో ఉన్న (యూ1 రిజర్వడ్ జోన్) రైతుల పొలాలు పరిశీలించడం జరిగింది. జనసేన పార్టీ చేనేత వికాస విభాగ చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (యూ1 రిజర్వడ్ జోన్) ను సిఎం దృష్టికి తీసుకువెళ్లి త్వరిత గతిన రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ యొక్క సమస్యను ఆల్రెడీ మా అధ్యక్షులు గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ కి మరియు పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ దగ్గరికి తీసుకు వెళ్లడం జరిగిందని. జనసేన పార్టీ తరఫున (యూ1 రిజర్వడ్ జోన్) రద్దు చేసేంతవరకు పోరాడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో, జనసేన పార్టీ చేనేత వికాస విభాగ చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు, మరియు రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ శేఖర్, మరియు తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరావు(ఎస్.ఎన్.ఆర్), గుంటూరు జిల్లా కార్యదర్శి రవి రమా, జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, నియోజకవర్గ పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు బీజేపీ నేతలు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.