వినోద్ జైన్ ని వెంటనే ఉరి తియ్యాలని జనసేన డిమాండ్

శ్రీకాళహస్తి నియోజకవర్గం, లైంగిక వేదింపులు తట్టుకోలేక మరణించిన చిన్నారి దీక్షితకు న్యాయం జరగాలని, నిందితుడు వినోద్ జైన్ ని వెంటనే ఉరి తియ్యాలని డిమాండ్ చేస్తూ శ్రీకాళహస్తి పట్టణంలో జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా విద్యార్థినులతో, పార్టీ నాయకులతో కలిసి కొవ్వొత్తులతో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ ప్రభుత్వ వైఖరి సంఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నా తాశ్చరంగా ఉంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేసే వారిపై చట్టాలు బలవంతులకు బలహీనంగా, బలహీనులకు బలంగా పనిచేసేలా ఉన్నాయని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు భవాని శంకర్, నాయకులు మున్న, తేజా, ప్రమోద్, కరీం, రఫీ, నితీష్ కుమార్, చందు చౌదరీ ఇతరులు పాల్గొన్నారు.