వృద్ధాప్య పెన్షన్ 3000 పెంచాలని జనసేన డిమాండ్

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు “వృద్ధాప్య పెన్షన్” 3000 వరకు పెంచుతాం అని హామీ ఇచ్చారు. వైసిపి ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది, మూడో విడత పెంచవలసిన వృద్ధాప్య పెన్షన్ ప్రస్తుతం రెండో విడత మాత్రమే పెంచడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగింది. మాటతప్పని మడమ తిప్పని నాయకులు అని గొప్పలు చెప్పుకుంటూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు, వృద్ధాప్య పెన్షన్ 2750 రూపాయలు చేయవలసింది పోయి, 2500 మాత్రమే చేయడం ద్వారా వృద్ధులు మోసపోతున్నారు. ఈ వృద్ధాప్య పెన్షన్ 3వ విడత కూడా ఒకేసారి పెంచాలని జనసేన పార్టీ తరుపున ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, జనసేన పార్టీ నాయకులు కనపర్తి మనోజ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.