ఆఫ్రాన్ పనులు త్వరలో పూర్తి చేయాల్ని జనసేన డిమాండ్

ఆత్మకూరు, సోమశిల ప్రాజెక్టు వద్ద కోట్ల రూపాయలతో జరుగుతున్న ఆఫ్రాన్ జనసేన పార్టీ మండల అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ పర్యటించి పనులను పరిశీలించి వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాల ముందు వర్షాల కారణంగా డ్యామ్ ముందు భాగము 20 నుంచి 30 అడుగులు గోతులు పడ్డాయి. భారీ వర్షాల కారణంగా డ్యామ్ ముందు నిర్మాణం పనులు కోసం గత ఏడాది ఫిబ్రవరి నెలలో సాయికృష్ణ సంస్ద 117 కోట్లతో టెండర్ దక్కించుకుంది. ఈ ఆఫ్రాన్ పనులు మార్చ్ నెలలో ప్రారంభం అయిన ఏడాదికాలం దాటినా ఇప్పటివరకూ పూర్తి కాకపోవడం వైసిపి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని అన్నారు. ఆఫ్రాన్ పనులు చేయటంలో జలవనరులు, అధికారుల నిర్లక్ష్యమా లేక గుత్తేదారుల బిల్లు కోసం నిర్లక్ష్యమా అని తెలిపారు. అనంతరం ఆఫ్రన్ పనులు వెంటనే పూర్తి చేయాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎడమ వైపు ఉన్న రిటేనింగ్ వాల్ ఎత్తు ఎడల్పు పెంచాలని నది పరివాహక ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా రాబోయే రోజుల్లో వచ్చే వర్షాకాలంలో దీనిని పూర్తిస్థాయిలో చేయని యెడల ప్రాజెక్టు ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ మండల కార్యదర్శి లింగా బత్తిన హరీష్ పాల్గొన్నారు.