బయ్యనగూడెం గ్రామంలో జనం కోసం జనసేన

పోలవరం: కొయ్యలగూడెం మండలం, బయ్యనగూడెం గ్రామంలో మండల అధ్యక్షులు తోట రవి, జిల్లా సంయుక్త కార్యదర్శి మద్దు తేజ ఆధ్వర్యంలో జనం కోసం జనసేన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి చంద్రమోహన్, పోలవరం నియోజకవర్గం ఇంఛార్జి చిర్రి బాలరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యువత భారీగా పాల్గొని ఘన స్వాగతం పలికారు. బైక్ కార్లతో భారీ ర్యాలీగా పవన్ కళ్యాణ్ గారి పవన్ రావాలి పాలన మారాలి స్లోగన్స్ తో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుని పార్టీ గాజు గ్లాస్ గుర్తుని ప్రజల్లోకి తీసుకు వెళ్తూ పార్టీ బలోపేతానికి కష్టపడుతున్న ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుంది అని, ప్రజలను గాలికి వదిలేసిన ఈ ప్రభుత్వం నేడు ప్రజలకు అభివృద్ధి చేసేశాము అని గొప్పలు చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం ఏమాత్రం అభివృద్ధి చేసిందో చూపాలని, ప్రజలు ప్రతి ఒక్కదాన్ని గమనిస్తున్నారని, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసి అభివృద్ధి చేయడం చేతకాని ఎమ్మెల్యే, ఈరోజు తన భార్యకు టికెట్ తెచ్చుకొని ఇప్పటివరకు చేయని అభివృద్ధి ఇప్పుడు చేస్తానంటే ఎలా నమ్ముతారు అని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టి వారిని మోసగించడం ఈ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తగదని 20, 24 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీని 50 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించుకొని పోలవరం నియోజకవర్గంలో వైసిపిని భూస్థాపితం చేస్తామని అన్నారు. మీరు సిద్ధమని సోషల్ మీడియాలో ఫ్లెక్సిల మీద వేసుకున్నప్పటికీ మిమ్మల్ని నమ్మటానికి జనాలు సిద్ధంగా లేరని, మీరు ఇంటికి వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం నాగకృష్ణ, చోడిపిండి సుబ్రహ్మణ్యం, టౌన్ అధ్యక్షులు మాదేపల్లి శ్రీను, ఏపూరి సతీష్, ప్రగడ రమేష్, గొలిశెట్టి శ్రీనివాస్, చావ్వ రాము, కోన కుమార్, దాకారపు మధు, లీగల్ సెల్ రామ్మోహన్, భువనేశ్వరి, ఉమా మహేశ్వరీ, కొండాబత్తుల నరసింహ, తాడేపల్లి గోపి, వామిశెట్టి మధు, సుంకర రాజేష్, నులకని శ్రీను, నరాల శ్రీను, చిన్నం మహేష్, సింగంశెట్టి శ్రీను, పారేపల్లి గగన్, వెంకట్ డాక్టర్, పారేపల్లి పండు, పారేపల్లి శ్రీను, మేకల గోపి, వాడపల్లి నాని, జనసైనికులు వీరమహిళలు భారీగా పాల్గొన్నారు.