కలెక్టర్ వెంటనే స్పందించి తగిన చేర్యలు తీసుకోవాలి జనసేన డిమాండ్

  • 2 కోట్లు రూపాయలు ఉపాధి హామీ నిధులు స్వాహా

కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం, కోడూరు మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భారీ స్థాయిలో జరిగిన అవినీతి ఎట్టకేలకు బట్టబయలైంది. పథకం ద్వారా జరిగిన పనులకు సంబంధించి నిర్వహించిన సామాజిక తనిఖీల్లో పథకం సిబ్బంది, అధికారులు పాల్పడిన అవినీతి బహిర్గతం అవ్వటం చూస్తుంటే కంచె చేను మేసినవిధంగా ఉంది, ఇది చాలా బాధాకరం. మండలంలోని 13 పంచాయతీలకు సంబంధించి రెండేళ్ల వ్యవధిలో పథకం ద్వారా రూ.7కోట్ల పనులు జరగగా, ఇందులో రూ 45.42,580 లక్షల నగదును పథకం అధికారులు, సిబ్బంది స్వాహా చేసినట్లు జగనన్న లేఔట్ లో అంతర్గత రహదారులకు గ్రావెల్ వేసామని చెప్పి సంబంధిత రికార్డులు లేకుండా చేశారని ఉన్నత అధికారులు చెప్పటం జరిగింది ఈ అవనితీ లక్షలో కాదు కోట్లులలో జరిగింది. గురువారం స్థానిక కార్యాలయం వద్ద నిర్వహించిన బహిరంగ విచారణ గ్రామసభలో ఏవో వెంకటలక్ష్మి పథకంలో జరిగిన అవినీతిని బట్టబయలు చేయడంతో పాటు జగనన్న పచ్చ తోరణంలొ పధకంద్వారా రోడ్ల వెంబడి పెట్టిన మొక్కలు కానరాకుండా పోయాయని. క్షేత్రస్థాయి నుంచి మండల అధికారుల వరకు వ్యవహరించిన తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయటం అభినందనీయం. చేయని పనులు కూడా బిల్లులు పెట్టి నగదును స్వాహా చేయటంపై తీవ్రస్థాయిలో మండిపడడంతో పాటు 45 లక్షల నగదును రికవరీ చేయాలని ఆదేశాలు జారీ చెయ్యటం గొప్ప విషయం. 45 లక్షలు స్వాహా కాదు ఈ అవనితీ త్రవ్వితే నియోజకవర్గం మొత్తం కొన్ని కోట్లు అవనితీ జరిగింది. జరిగిన పనుల్లో కూడా నాణ్యత లోపించిందని దీనిపై త్వరలో క్వాలిటీ కంట్రోల్ అధికారులు కూడా పరిశీలన చేయనున్నట్లు వెంకటలక్ష్మి చెప్పారు. జిల్లా కలెక్టర్ తో పాటు పిడికి, విజిలెన్స్ అధికారులకు ఈ నివేదికను అందించటం ఆమె నిజాయతీకి నిదర్శనం ఇలాంటి అధికారులు నియోజకవర్గంకు చాలా అవసరం. రాష్ట్ర ముఖ్య మంత్రి, నియోజకవర్గ ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి అవనీతి చేసిన వారి పైన క్రిమినల్ కేసులు పెట్టి చట్టపరమయన చెర్యలు తీసుకోని అవనితీ సొమ్మును ప్రభుత్వం రికవరి చెయ్యాలని జనసేన పార్టీ తరుపున డిమెండ్ చేస్తున్నాము. ప్రభుత్వం, అధికారులు స్పందించకపోతే ప్రజా ఉద్యమం చేస్తామని హెచ్చిరిస్తున్నామని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ రావు అన్నారు.