కందుకూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లాలోనే ఉంచాలని జనసేన డిమాండ్

కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలంలోని కరేడు గ్రామంలో పర్యటించిన కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జి పులి మల్లిఖార్జునరావు. గ్రామస్థాయి కమిటీలు మరియు మండల స్థాయి కమిటీలు గురించి చర్చించి వాటికి నిర్ణయ అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం ఉలవపాడు మండలం చాగల్లు గ్రామంలో పర్యటిస్తూ గ్రామ మరియు మండల కమిటీ వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. జన సైనికులు ప్రతి ఒక్కరు కూడా కందుకూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లాలోనే ఉంచాలని మన పార్టీ తరపున ప్రభుత్వానికి కందుకూరు నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెల్లేలా చేయాలని పులి మల్లికార్జున రావుని అందరూ కోరారు. నెల్లూరు జిల్లాకు మార్చడం వల్ల వాళ్లకి కలిగే నష్టాలను వివరించారు. ఈ సందర్భంగా పులి మల్లికార్జునరావు మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గం ఎప్పటికీ ప్రకాశం జిల్లాలోని ఉండే విధంగా అందరూ కలిసి పోరాడుదాం మన పార్టీ తరపున ఈ విషయాన్ని జిల్లా అధ్యక్షులు వారి తోటి చర్చించి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి కచ్చితంగా నెల్లూరు జిల్లాకి వెళ్ళకుండా చేద్దామని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కత్తి అంకోజి రావు, జిల్లా సంయుక్త కార్యదర్శి డేగల దొరస్వామి, ఉలవపాడు మండల అధ్యక్షుడు టి.వంశీ, నటరాజ. ఫయజ్, పులిపాడు మండల అధ్యక్షులు టి.వంశీ, కందుకూరు మండల అధ్యక్షులు గోకరాజు మదన్, జనసేన నాయకులు బాలచందర్ నాయుడు, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.