మడమ తిప్పనన్న జగనన్న- మా టిడ్కో ఇల్లు ఎప్పుడిస్తావన్నా??

  • జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు
  • అనంత జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ

గుంతకల్ నియోజకవర్గం: జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు జగనన్న కాలనీల సామాజిక పరిశీలన కార్యక్రమం గుంతకల్ రూరల్ లో అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ ఆధ్వర్యంలో గుంతకల్ మండల, పట్టణ అధ్యక్షులు కురువ పురుషోత్తం, బండి శేఖర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ మాట్లాడుతూ మా అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చేసిన జగనన్న కాలనీల సామాజిక పరిశీలన కార్యక్రమంలో ముఖ్యంగా మాకు అర్థమైంది గత ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలో భాగంగా టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తిగా గాలికి వదిలేశారు, జగనన్న ముఖ్యమంత్రి అవ్వంగానే 1₹ రూపాయికే టిడ్కోఇల్లు రిజిస్ట్రేషన్ అన్న హామీ ఏమైందని తక్షణం లబ్ధిదారులకు ఇల్లు కేటాయించాలని ప్రశ్నించారు, ప్రధానంగా జగనన్న కాలనీలో మౌలిక వసతుల కల్పన పేరిట వైసిపి ప్రభుత్వం రూ.89 వేల కోట్ల ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తుంది. ఇక్కడ చూస్తే ఎటువంటి మౌలిక వసతులు లేవు. ఆ కోట్లు ఎటు పోతున్నాయి. ప్రతి జగనన్న కాలనీలో రోడ్లు, వీధి దీపాలు, పార్కులు, గ్రంథాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మిస్తామని రకరకాల కబుర్లు చెప్పి ప్రజల్ని మోసం చేస్తూనే ఉంది. మౌలిక వసతుల పేరిట ఈ ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించాం. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ప్రజా ఆగ్రహానికి గురికాకముందే పేదవాడి సొంతింటి కల నిజం చేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుంతకల్ మండల, పట్టణ అధ్యక్షులు కురువ పురుషోత్తం, బండి శేఖర్ గుంతకల్ చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్ సీనియర్ నాయకులు గాజుల రాఘవేంద్ర, కప్పట్రాళ్ల కోటేశ్వరరావు మైనారిటీ నాయకుడు దాదు, కాపు సంక్షేమసేన నాయకులు బుర్ర అఖిల్ నిస్వార్థ జనసైనికులు చికెన్ మధు, లారెన్స్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.