కాటారం మండలంలో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

  • జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులకు ప్యాడ్స్, పెన్నులు మరియు పండ్ల పంపిణీ చేసిన జేరుపోతుల సనత్ కుమార్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కాటారం మండలంలో జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ జెడ్.పి.ఎస్. ఎస్ పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు కాటారం మండల నాయకులు జనగాం పవన్ ఆధ్వర్యంలో ప్యాడ్స్, పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన జిల్లా జిల్లా సనత్ కుమార్ పాల్గొని విద్యార్థులకు ప్యాడ్స్, పెన్నులు ఇస్తూ విద్యార్థులు భవిష్యత్తులో తమ లక్ష్యాలను సాధించాలని, మంచి ఉద్యోగాలు చేయాలని నేటి బాలలే రేపటి పౌరులని, చదువు ఒక్కటే మంచి మార్గమని విద్యార్థులకు సూచించారు. ప్రజా సమస్యల పట్ల జనసైనికులు నిరంతరం పోరాటం చేస్తామని సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎంచుకున్నామని, తెలంగాణలో కూడా జనసేన పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని సనత్ కుమార్ గారు ఈ సందర్భంగా తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో కుమ్మరి రమేష్, బండం ప్రణయ్ సురేష్ రాకేష్ వంశీ తదితరులు పాల్గొన్నారు.