సమస్య పరిష్కారం కొరకు జనసేన పోరాడుతుంది: వినుత కోటా

శ్రీకాళహస్తి మండలం, గోవిందరావు పల్లి పంచాయతీలోని, మాదిరిపల్లి గ్రామం మద్యలో ఉన్న పురాతన చింతచెట్టుకి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో చెట్టు కుప్పకూలి ఇళ్ళపై పడడం వల్ల 3, 4 ఇల్లు కూలిపోవడం జరిగింది. గ్రామస్థులు సమాచారం ఇచ్చిన వెంటనే శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ఆ గ్రామానికి చేరుకుని ఎమ్మార్వోతో ఫోన్లో సమస్య తెలియజేసి రెవెన్యూ అధికారులను పంపి మంటలు ఆర్పించాలని, కూలిన చెట్టును తొలగించాలని కోరడం జరిగింది. స్పందించిన ఎమ్మార్వో వెంటనే విఆర్ఓ ను పంపడం జరిగింది. విరిగిన చెట్టు కొమ్మలకు తొలగించడం కొరకు గ్రామస్థులకు వినుత 5,000 ఆర్థిక సహాయం చేశారు. గ్రామంలోని స్కూల్ ఉన్నా కూడా మూతబడి ఉందని స్కూల్ లేక 30 మంది పిల్లలు 2 కి.మీ నడిచి వెళ్తున్నట్టు మహిళలు సమస్యను తెలిపారు. తప్పక కలెక్టర్ కి స్కూల్ సమస్య తెలిపి పరిష్కారం కొరకు జనసేన పోరాడుతుందని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, నాయకులు శ్రీనివాసులు, రవి కుమార్ రెడ్డి, బాలాజీ, శివ తదితరులు పాల్గొన్నారు.