అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి జనసేన ఆర్థిక సహాయం

అవనిగడ్డ: కె.కొత్త పాలెం పంచాయతీ పరిధిలో ఉన్న ఉత్తరపాలెం గ్రామంలో ఇటీవల అగ్ని ప్రమాదం జరిగి ఒక కుటుంబానికి తీవ్ర నష్టంతో కట్టు బట్టలతో బయటకు వచ్చారు. ఈ ప్రమాద బాధితులకు మోపిదేవి మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులు పూషడపు రత్న గోపాల్ అధ్యక్షతన బాధిత కుటంబానికి రూ.10వేలు రూపాయల నగదు, బియ్యం మరియు నిత్యావసర సరుకులు అందచేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పూషడపు రత్నగోపాల్, మండల పార్టీ ఉపాధ్యక్షులు భోగిరెడ్డి సాంబశివరావు, యడ్లపల్లి అజయ్, కలపాల ప్రసాద్, గ్రామ నాయకులు బాచు శ్రీను, రేపల్లె నాగేంద్ర బాబు, చావాకుల సురేష్, కొత్తపాలెం గ్రామ ఒకటవ వార్డు సభ్యుడు మత్తి వంశీ కృష్ణ, మత్తి శివ నంది, తుటారం శివ కోటేశ్వరరావు, మత్తి వెంకటేశ్వర రావు, తుటారం శ్రీను మరియు జనసైనికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహాయ సహాకారాలు అందించి బాధిత కుటుంబానికి అండగా నిలిచిన మరియు కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.