రేపల్లెలో జనసేన జెండా ఆవిష్కరించిన గాదె

రేపల్లె నియోజకవర్గం ఈదుపల్లి గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు పాల్గొనడం జరిగింది. జనసేన పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇప్పటివరకు ఈ గ్రామంలో పార్టీ జెండా అనేది కనపడలేదు. ఈరోజు మన అధ్యక్షులు పుట్టినరోజు సందర్భంగా మొట్టమొదటిసారిగా ఇక్కడ పార్టీ జెండాని గాదె వెంకటేశ్వరరావు ఆవిష్కరించడం జరిగింది. గ్రామ జనసైనికులు చాలా ఉత్సాహంగా బాంబులు కాల్చుకుంటూ ఊరేగింపుతో నాయకుల్ని ఆహ్వానించడం జరిగింది.