జనసేనాని జన్మదిన వేడుకలు

పాలకొల్లు నియోజకవర్గం పాలకొల్లు టౌన్ నాయకులు బిట్టా లక్ష్మి నారాయణ, యాళ్ల రవీంద్ర నాయుడు కాశెట్టి సురేంద్ర, నల్ల మోతు ప్రసాద్ ఆధ్వర్యంలో అంజలి మానసిక వికలాంగుల పాఠశాలలో కేక్ కట్ చేసి చిన్నారులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా జనసేన జిల్లా సెక్రటరీ బోనం చినబాబు, జిల్లా జాయింట్ సెక్రటరి ఉన్నమట్ల ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. ముందుగా జనసేనానికి చిన్నారులు శుభాకాంక్షలు తెలియజేసారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి చినబాబు గారు మాట్లాడుతూ టౌన్ లో ఇలాంటి మంచి కార్యక్రమం చేయడం శుభపరిణామని ఇలాగే మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగాలని ప్రతి కార్యక్రమానికి నా మద్దతు తప్పకుండా ఉంటుందని కార్యక్రమం ఏర్పాటు చేసిన వారిని అభినందించారు. ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ సీనియర్ జనసైనికులు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జనసైనికులలో జోష్ నింపిందని ప్రత్యేకంగా శ్రద్ద చూపిన లక్ష్మి నారాయణ బిట్టా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పెనుమదం ఎంపీటీసీ మానేపల్లి శ్రీధర్, పోడూరు మండల అధ్యక్షులు పితాని వెంకి జనసేన వీర మహిళలు, జుత్తుక ప్రియాంక (రియా) మైగాపుల పద్మజ దేవరపు ఝాన్సీముత్యాల అశ్విని ఉల్లంపర్రు జనసైనికులు మరియు కొత్తకోట అప్పారావు పవన్ కళ్యాణ్ అభిమాన సంఘము నాయకులు పడాల ఉమా, గంటా శ్రీనివాసరావు ఆదినారాయణ చుండూరి రంగయ్య నాయుడు డి, వెంకి బాబి కాండ్రేగుల మణికంఠ ఆచంట సురేష్ కుమార్ రవి, మద్దాల శీను మోహన్ గుప్తా తరుణ్ తదితరులు పాల్గొన్నారు.