నెల్లూరు సిటీలో ఘనంగా జనసేన పతాకావిష్కరణ

  • ఇప్పుడే జ్ఞానోదయం అయిందా
  • మనం చేస్తే సంసారం మరొకరు చేస్తే ఇంకోటి ఏదో అన్నారట
  • ఓటిపిలతో వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అవుతుంది అని వాలంటీర్ల విషయంలో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పలమార్లు ఉచ్చరిస్తే దానికి గందరగోళం చేశారు మీ వైసిపి నాయకులు. ఇప్పటికి జ్ఞానోదయం అయింది మీకు..
  • ఇప్పటికే ఓటీపీల ద్వారా వ్యక్తిగత సమాచారంతో కొంతమంది వాలంటీర్లు చేసిన చేతివటానికి బాధ్యులెవరు..?
  • వారికి ఏ శిక్షలు విధిస్తారు? తెలిపి తర్వాత ఎలక్షన్ల తర్వాత టిడిపి వాళ్ళు చేసే ఓటీపీల దుర్వినియోగం గురించి ఆలోచించండి
  • జనసేన పార్టీ జెండా వేడుకలో గునుకుల కిషోర్

నెల్లూరు: జనసేన పార్టీ జాతీయ మీడియా ప్రతినిధి, డిసిప్లినరీ కమిటీ హెడ్, సిటీ నిర్దేశకులు వేములపాటి అజయ్ సూచనలతో సత్యనారాయణపురం, నెల్లూరు సిటీ, ఐదవ డివిజన్లో జనసేన నాయకులు పార్టీ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నెల్లూరు సిటీలో జనసేన పార్టీ మద్దతు దారులు గాని పవన్ కళ్యాణ్ గారి అభిమానులను అధికసంఖ్యలో ఉన్నారు. క్రియాశీలక సభ్యత్వంలో కూడా దాదాపుగా 1500 దాటింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన మార్కు చూపే విధంగా చిరంజీవి యువత సీనియర్ నాయకులు జనసేన పార్టీ క్రియాశీల సభ్యులు అందరూ కలిసి జనసేన పార్టీ ఆశయాలను పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను ప్రతిగడపకు చేర వేసే విధంగా సిటీ నిర్దేశకులు వేములపాటి అజయ్ ఆధ్వర్యంలో పనిచేస్తాం. నెల్లూరు సిటీలోని పలు ముఖ్య కూడళ్ళలో జనసేన పార్టీ జెండాలను స్థాపించి ప్రజా ప్రభుత్వం స్థాపిస్తే జనసేన పార్టీ తరఫున ప్రజలకు మేలు జరుగుతుందనే విషయాన్ని అందరికి తెలియజేసే విధంగా త్వరలో కరపత్రాలతో ఇంటింటా ప్రచారానికి శ్రీకారం చేస్తాం. ఓటీపీలు ఇవ్వడం వ్యక్తిగత సమాచారం దోపిడీకి గురవుతుందని పలుమార్లు పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించిన పట్టించుకోకపోగా ప్రతిపక్షాలు ఓటిపిలు గూర్చి రాద్ధాంతం చేస్తున్న సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారికి వైసిపీ నాయకులకి వర్తించేట్లులేదు. వైసిపి నాయకులకు ఒక చట్టం ప్రతిపక్షాలకు, ప్రజలకు ఒక చట్టంలా ఉంది. ప్రస్థుతం వాలంటీర్లు 42 పేజీల జగన్ పుస్తక ప్రచారంలో బిజీగా ఉన్నారు ప్రతి ఇంటికి ప్రభుత్వ ఖజానాతో వైసిపి ఫ్రీ ప్రచారం సాగుతుంది. ఈ నాలుగు సంవత్సరాల వైసిపి దౌర్జన్యాలను, దోపిడీలను, బాధలను అర్థం చేసుకొని బంగారు భవిత కై పని చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ఈ సారి అవకాశం ఇచ్చి ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలందరూ సహకరించాల్సిందిగా పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో మా నాయకులు నాగబాబు, నాదెళ్ల మనోహర్, సిటీ నిర్దేశికులు అజయ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీని ఒక బలమైన శక్తిగా తయారు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో పాటు జనసేన సీనియర్ నాయకులు, చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏటూరి రవికుమార్, జనసేన జిల్లా అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి, జనసేన సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, చిరంజీవి యువత అధ్యక్షులు ఈగి సురేష్, జిల్లా కార్యదర్శి, కోవూర్ కేర్ టేకర్ గుడి హరి రెడ్డి, 5వ డివిజన్ నాయకులు మోష, నగర కార్యదర్శి హైమావతి,వరుణ్ తేజ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గుర్రం కిషోర్, ప్రభాకర్, 11వ డివిజన్ ఇన్ చార్జీ రమణ, నగర కార్యదర్శి చిన్ని పృద్వి, నగర కార్యదర్శి ఊటుకూరు రమేష్, 11వ డివిజన్ ఉపాధ్యక్షులు కొండ వనబాబు, 11వ డివిజన్ కార్యదర్శి దత్తాత్రేయ, ఆరో డివిజన్ కే వెంకటరమణ, సుబ్బు, హరి, వరుణ్, పృద్వి, రాము, తరుణ్, ప్రశాంత్ గౌడ్, మౌనేష్, హేమచంద్ర యాదవ్, బన్నీ, షాజహాన్, ఖలీల్, కేశవ తదితరులు పాల్గొన్నారు.