బోత్తపగూడెం గ్రామంలో జనం కోసం జనసేన

జీలుగుమిల్లి మండలం, బోత్తపగూడెం గ్రామంలో గురువారం జనం కోసం జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా.. గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. జనసేన పార్టీ సిద్ధాంతాలు మేనిఫెస్టో ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించడం జరిగింది. జనసేన పార్టీ అధికారంలోకి రాగానే వారి సమస్యలను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది. ఎంతసేపూ తమ పార్టీని వైసిపి ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పోగుడుకోవడం తప్ప ఏ రోజు అభివృద్ధి కనపరచలేదని.. గిరిజనప్రజా సమస్యలపై ఏరోజు మాట్లాడలేలేదని.. రానున్న ఎన్నికల్లో తెల్లం బాలరాజు కి గట్టిగా బుద్ధి చెబుతారని మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము, వెంకటేశ్వర్లు, కొప్పుల శ్రీకాంత్, కె రమేష్ సోమరాజు, ప్రెసిడెంట్ అభ్యర్థి కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.