విడివాడ ఆధ్వర్యంలో జనంలోకి జనసేన జనం కోసం జనసేన

తణుకు నియోజవర్గం: ఇరగవరం మండలం, ఇరగవరం గ్రామంలో శుక్రవారం జనంలోకి జనసేన జనం కోసం జనసేన అనే కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విడివాడ రామచంద్రరావు ప్రతి ఇంటికి వెళ్లి పవన్ కళ్యాణ్ గారి అశయాలు సిద్ధాంతాల్ని ముందుకు తీసుకువెళ్లి పవన్ కళ్యాణ్ గారు చేసిన సేవా కార్యక్రమాలు ప్రతి ఇంటికి తెలియజేశారు. అనంతరం విడివాడ రామచంద్రరావు మీడియాతో మాట్లడుతూ ఇరగవరం మండలం, హెడ్ క్వార్టర్ అయిన సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదని మరియు గ్రామంలో పందులు ఇంకా తిరుగుతున్నాయని అలాగే తణుకు నుండి ఇరగవరం వచ్చే రోడ్డు ఎక్స్టెన్షన్ అనే పేరు చెప్పి పచ్చని చెట్లు నరికివేసి రోడ్డు సరిగ్గా వెయ్యలేదని గ్రామంలో పారిశుద్ధ్యం సరిగ్గా వహించట్లేదని గ్రామస్తులు వాబోతున్నారు. ఈ కార్యక్రమంలో ఇరగవరం మండల అధ్యక్షులు ఆకేటి కాశి, ఇరగవరం మండల కమిటీ నాయకులు మంగిన నాగరాజు, చవ్వాకుల కిరణ్, ఆరేటి చంటి, చౌవాకుల మాణిక్యాలరావు మరియు ఇరగవరం గ్రామం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీరమహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.