జనసేనకు బ్రహ్మరథం పడుతున్న తిరుపతి వాసులు

  • ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్న కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు

తిరుపతి సిటీ: తిరుపతిలో శనివారం ఉదయం కృష్ణాపురం ఠాణా, బేస్తా వీది, కోలా వీధి, చింతకాయల వీధి, బొమ్మగుంట, కావమ్మ గుడి, నెహ్రూ నగర్ లు.. సాయంత్రం గిరిపురం, పరసాల వీధి, ఎస్డి రోడ్, అనంతవీధి, టీ నగర్, గాలి వీధి లలో జనసేన టిడిపి బిజెపి పార్టీలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు టిడిపి ఇన్చార్జి సుగుణమ్మ, ఆ పార్టీ సీనియర్ నాయకులు ఊకా విజయ్ కుమార్, కోడూరు బాలసుబ్రమణ్యం.. జనసేన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హరిప్రసాద్, ఇన్చార్జి కిరణ్ రాయల్, మరియు వీరమహిళలు జనశ్రేణులు.. మూడు పార్టీల ముఖ్య నేతలతో కలిసి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో గిరిపురం వద్ద పర్మిషన్ తో జనసేన ప్రచారం కొనసాగిస్తుండగా.. వైసిపి శ్రేణులు పర్మిషన్ లేనప్పటికీ ఒకరికొకరు ఎదురుపడి వాగ్వాదానికి దిగారు ఈ ఘర్షణలో జన శ్రేణులపై వైసిపి కార్యకర్తలు దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో పలువురికి కాయాలు కావడంతో హుటాహుటిన వారిని హాస్పిటలకు జనసేన నేతలు తరలించారు. ఈ సందర్భంగా.. ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాసులు మాట్లాడుతూ దౌర్జన్యాలకు దాస్టికాలకు దిగటం వైసిపికి కొత్తమి కాదని, పర్మిషన్తో మేము ప్రచారం కొనసాగిస్తున్నామని, గత కొద్ది రోజులుగా తిరుపతిలో మా ప్రచారాన్ని అడ్డుకోవడం జరుగుతుందని, గొడవే కావాలి అనుకుంటే దేనికైనా మేము సిద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో జనసేనదే గెలుపని, ఎక్కడ చూసినా ప్రజలు జనసేనకు బ్రహ్మరథం పడుతున్నారని, జనసేన ప్రచారాన్ని అడ్డుకొని, మా ప్రచారాన్ని ప్రజల్లోకి వెళ్ళకుండా వైసిపి నేతలు కుట్రలు పన్నుతున్నారని, మీ దౌర్జన్యాలకు భయపడే ప్రసక్తే లేదని జనసేన టిడిపి బిజెపి నేతలు స్పష్టం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో.. పెద్ద ఎత్తున జనసేన బిజెపి టిడిపి టిడిపి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.