నిరుపేద రైతుకు మనోధైర్యాన్నిచ్చిన జనసేన

గుంటూరు, కూలి పనులనిమిత్తం గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం గ్రామం నుండి అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం గుట్టపల్లి గ్రామానికి వెళ్ళిన జనసైనికులకు పక్క గ్రామంలో “సోమవార గ్రామ నివాసి” నిరుపేదరైతు అయినటువంటి కొండారెడ్డి అనారోగ్యం కారణంగా ఇబ్బంది పడుతున్నారని, ఆయనకు సహాయం చేయాలని జనసేన పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి డేగల లక్ష్మణ్ సూచనల మేరకు వెంటనే స్పందించిన జనసైనికులు ఆ గ్రామం వెళ్ళి ఆయనకు కొంత ఆర్ధికసహాయం చేసి పళ్ళు అందజేయడం జరిగినది. ఈ సహాయం చేసినవారు గుంటూరు రూరల్ మండల కార్యదర్శులు యర్రంశెట్టి సాంబశివరావు, తవిటి అశోక్, మరియు జనసేన కార్యకర్తలు ఈపూరు రవి, గోపాల్, సాంబశివరావు, యర్రంశెట్టి ఈశ్వర్, నాగరాజు, ప్రసాద్, ఏడుకొండలు, తదితర జనసైనికులు పాల్గొన్నారు.