మహాత్మా జ్యోతిరావు పూలేకి జనసేన ఘన సుమాంజలి

తిరుపతి, భరతమాత ముద్దు బిడ్డ, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, అంటరానితనాన్ని రూపుమాపడానికి కృషి చేసిన సామాజిక సంస్కర్త, మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శి, నిత్యస్ఫూర్తిప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మంగళవారం జనసేన పార్టీ తిరుపతి పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి, ఉపాధ్యక్షులు బాబ్జి, రాష్ట్ర, పట్టణ నాయకులు కీర్తన, కొండా రాజామోహన్ మునస్వామి, సుమన్ బాబు, రాజేష్ ఆచారి, కిరణ్, ముత్యాలు, మణికంఠ, వినోద్, మల్లి తదితరులతో కలిసి స్థానిక బాలాజీ కాలనీలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన సుమాంజలి తెలియజేశారు.