Hyderabad: సిరిసిల్ల ఘటనలో చిన్నారిని పరామర్శించిన జనసేన గ్రేటర్ అధ్యక్షులు రాధారం రాజలింగం

సిరిసిల్ల ఘటనలో అత్యాచారానికి గురై నీలోఫర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్నారి సిరి ఆరోగ్యం పరిస్థితి ఎలా ఉంది అని జనసేనపార్టీ తరఫున నేడు హాస్పటల్లో చిన్నారిని, వారి తల్లిదండ్రులను పరామర్శించిన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం.
జనసేన గ్రేటర్ అధ్యక్షులు రాధారం రాజలింగం మాట్లాడుతూ…

రాష్ట్రంలో మహిళలపై మైనర్ బాలికలపై ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి.

గత సంవత్సరం క్రితం ప్రియాంక రెడ్డి దిశ పై నలుగురు మూర్ఖులు అరాచకంగా అత్యాచారం చేసిన విషయం అందరికీ తెలిసిందే. అదేవిధంగా గత కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారం చేసిన విషయాన్ని ఇంకా మనం మరువలేదు.

మళ్లీ మొన్నటికి మొన్న నల్గొండలో 54 సంవత్సరాల మహిళను మానభంగం చేశారు.

సిరిసిల్లలో ఆరేళ్ల చిన్నారి సిరిపై అత్యాచారం చేసిన శంకర్ అనే దుర్మార్గుడు అతను అధికార ప్రజాప్రతినిధి మహిళా సర్పంచ్ భర్త అని, అతన్ని ఉరి తీయాలని సిరిసిల్ల ప్రజలు రోడ్లపై బైఠాయించి సోషల్ మీడియా ద్వారా ఎంత మొత్తుకున్నాగాని ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడంలేదు.

ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ ఇతను కూడా మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు అని ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న వాళ్లను ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి చట్టపరంగా వీలైనంత త్వరగా ఇలాంటి వాళ్లను ఉరి తీయాలి అప్పుడే పరిష్కారానికి న్యాయం జరుగుతుంది.

అదేవిధంగా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి అమ్మాయిని చదివించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకోవాలి.

ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మద్యం షాపులను కూడా తగ్గించాలి

అదేవిధంగా గంజాయి మత్తులో యువకులు ఏమి చేస్తున్నారో వాళ్లకు తెలియడంలేదు ఎంతో మంది దీనికి బలైపోతున్నారు.

ప్రత్యేకంగా పండిస్తున్న గంజాయి సాగును ఎక్కడికక్కడ సోదాలు చేసి దీన్ని సాగు చేయకుండా ప్రభుత్వం బాధ్యత వహించాలి.

సరఫరా చేస్తున్నటువంటి వ్యక్తులను దీనికి బానిస అవుతున్న యువతను కౌన్సెలింగ్ చేసి గంజాయి, డ్రగ్స్ బారిన పడకుండా వేగవంతంగా ప్రభుత్వం అరికట్టాలని జనసేనపార్టీ తరఫున కోరుతున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రేటర్ కమిటీ సభ్యులు రాజేష్ యడమ, సీనియర్ నాయకులు రమేష్ కుమార్, గ్రేటర్ లోని డివిజన్ల ప్రెసిడెంటులు కార్తీక్, మహేష్, సురేష్, కొల్లా శంకర్, వెంకట సాయి ప్రసాద్, రామకృష్ణ, రాజేష్ సాహూ, భరత్ గణేష్, డివిజన్ల కమిటీల సభ్యులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.