టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఇతోధిక సాయం చేసిన జనసేన

కందుకూరు, “నేటి బాలలే రేపటి పౌరులు, నేటి విద్యార్థులే రేపటి ఉజ్వల భవిష్యత్తుకు పట్టుకొమ్మలు” అన్న సూక్తులు ఆధారంగా పవన్ కళ్యాణ్ ఆశయాలు, జనసేన సిద్ధాంతాలు ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్ళే జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా కందుకూరు నియోజకవర్గం, ఉలవపాడు మండలం, భీమవరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన టెన్త్ క్లాస్ విద్యార్థులకు జామెట్రీ బాక్స్ లు కందుకూరు నియోజకవర్గ జనసేన నాయకులు ఇనకొల్లు శ్రీనివాస్ ఆర్థికసాయంతో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది ప్రోత్సాహంతో స్థానిక జనసేన యువకులు కేసారపు లక్ష్మణ్, ఆలూరి ప్రతాప్ లు బహూకరించారు. ఈ సందర్భంగా కె. లక్ష్మణ్ విద్యార్థులను ఉద్దేశించి నేటి విద్యార్థులే రేపటి ఉజ్వల భవిష్యత్తుకు పట్టుకొమ్మలు అని ఉటంకిస్తూ మేము చేసేది చిన్న సాయమే అయినా విద్యార్థులు మానసిక వికాసానికి దోహదం చేస్తాయి అని వివరించారు. ఏ.ప్రతాప్ మాట్లాడుతూ మేము అడిగిన వెంటనే శ్రీనివాస్ విద్యార్ధులకు ఇతోధిక సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఉపాద్యాయులు మాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. జనసేన నాయకులు ఇనకొల్లు శ్రీనివాస్ తన సందేశాన్ని ఇస్తూ రాజకీయాలకు అతీతంగా రానున్న టెన్త్ క్లాస్ పరీక్షల ఫలితాలు అనంతరం కందుకూరు నియోజకవర్గంలో 5 మండలాలకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే ఒక్కో మండలానికి మండలం ఫస్ట్ వచ్చిన విద్యార్థులకు 10116/- ఇస్తానని ప్రకటించారు. ఈ మొత్తం చిన్నదే అయినా విద్యార్థులు మానసిక వికాసానికి, మేధో వికాసానికి దోహదం చేస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. తదనుగుణంగా విద్యార్థులు రేపటి పదవతరగతి పరీక్షలో మెరుగైన ఫలితాలు సాధించడానికి దోహదం చేస్తాయి. ఇలాంటి కార్యక్రమాలు లింగసముద్రం మండలం పెదపవని జిల్లా పరిషత్ హైస్కూలులోను, నెల్లూరు జిల్లా ముత్తుకూరులో బాలికల గురుకుల పాఠశాలలో కూడా చేయడం జరిగింది అని శ్రీనివాస్ వివరించారు. పరీక్షలకు హాజరయ్యే ప్రతి విద్యార్థికి “ఆల్ ది బెస్ట్” తెలిపారు.