కొత్తపేట నియోజకవర్గంలో జోరుమీదున్న జనసేన!

  • బండారు సమక్షంలో భారీ చేరికలు

కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ప్రముఖ నాయకులు, నియోజకవర్గ ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్ నాయకత్వంలో ఈరోజు భారీ చేరికలు పలు గ్రామాలలోనీ వారు వాడపాలెం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ ఇంట వారి సమక్షంలో జనసేన పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో మహాదశ బాబులు నాయకత్వం లోనూ, రావులపాలెం మండలం బొక్క ఆదినారాయణ రావు జిల్లా కార్యదర్శి నాయకత్వంలో అదేవిధంగా దేవరపల్లి గ్రామానికి చెందిన పలువురు బీసీ శెట్టి బలిజ సోదరులు బొక్క ఆదినారాయణ జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వారి ఆధ్వర్యంలో పలువురు ఈరోజు బండారు శ్రీనివాస్ వారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ భారీ చేరికలతో ఎంతో బలోపేతమైన జనసేన పార్టీ అని పలువురు, పలు గ్రామాల ప్రజలు అప్పుడే కొత్త పేట నియోజకవర్గంలో, ఎన్నికల సందడి మొదలైందా అనే విధంగా ప్రజలు అనుకుంటున్నారని, జనసేన పార్టీ దిన, దిన అభివృద్ధి చెందుతూ, కొత్తపేట నియోజక వర్గం లో మొదటి స్థానం లోకి ఎగబాకిందనీ, ఇప్పటికే సుమారు 80 వేల మంది వరకు జనసేనాని నాయకత్వాన్ని గెలిపించడానికి ఓటర్లు ఉంటారని అంచనాతో ప్రతి ఒక్కరిలోనూ ఒక చైతన్యం ఒక విప్లవం వచ్చిందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అనడానికి ఈ భారీ చేరికలు కారణమని, జనసేనాని అందరూ వాడని, జనసేనాని కోసం అందరూ, అన్ని వర్గాలు ఏకం అయ్యే విధంగా, ప్రతి ఒక్కరిలోనూ, కులమతాలకు అతీతంగా చైతన్యం ఉప్పొంగుతోందని, ఇప్పటికే పలువురు చేరికతో ఈ సత్యం రుజువుఅవుతుందని తెలియజేశారు. శుక్రవారం మహాదశ బాబులు నాయకత్వంలో కొత్తపేట గ్రామంలో లంక ప్రసాద్, చోడపనీడి శ్రీను, శ్రీకాకుళపు చిన్న, పోలిశెట్టి ప్రీతి సౌమ్యశ్రీ, బండారు పుల్లారావు, వాసంశెట్టి నాగేశ్వరరావు, కుడుపూడి రామకృష్ణ, గోదసి సత్తిబాబు, బండారు రామకృష్ణ, బండారు అర్జునరావు, బండారు రవి, బండారు హరి వీరు బండారు శ్రీనివాస్ సమక్షంలో కొత్తపేట గ్రామం నుంచి జనసేనలో చేరడం జరిగింది. అదే విధంగా రావులపాలెం మండలం దేవరపల్లి పంచాయితీ పరిధిలో బొక్క ఆదినారాయణ రావు నేతృత్వంలో వీరి నాయకత్వంలో, కాకర శ్రీనివాస్ రావు, చిట్టూరి రాంబాబు జనసేన పార్టీలోకి చేరినారు. వీరి చేరికకు బండారు శ్రీనివాస్, పలువురు జనసైనికులు కార్యకర్తలు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేశారు.