తెలంగాణలో బలమైన శక్తిగా ఎదుగుతున్న జనసేన

పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన తెలంగాణ రాజకీయాలపై ప్రతేక ఫోకస్ ఉంటుంది. పవన్ ఏపీ రాజకీయాలపైనే కాకుండా తెలంగాణ పై ప్రత్యేక ఫోకస్ పెడతారు.. అక్కడ పార్టీకి ఎంతో కొంత బలం ఉంది కాబట్టి, ఆ బలాన్ని మరింత రెట్టింపు చేసుకోవడమే లక్ష్యంగా పవన్ పనిచేస్తున్నారు. కానీ తెలంగాణలో కూడా జనసేనకు నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

తెలంగాణ పోరాట స్ఫూర్తే జనసేన ఏర్పాటుకు నాంది అని, తెలంగాణలో ఆత్మగౌరవం కోసం ఎంతోమంది ఆత్మబలిదానాలు చేశారని అన్నారు, సామాజిక మార్పు కోసం ప్రయత్నం చేయాలని .. అడుగుపెడితే తప్ప అనుభవం రాదని తెలంగాణ ఉద్యమం గురించి పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్తుంటారు.

అన్నింటికీ సిద్ధమయ్యే రాజకీయాల్లోకి వచ్చిన జనసేనాని
తెలంగాణ రాజకీయాల్లోకి వస్తుంటే భయపెట్టారు, ఎలా నిలదొక్కుకుంటుఒదో చూస్తామన్నారు. ఏపీలోనే పదవులు కోరుకోని పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఏం కోరుకుంటారు..? ప్రజలు బాగుపడాలి అని కోరుకొనే జనసేన, అందుకు కొత్తతరం యువత, ఆడపడుచులు చట్టసభల్లో కాలు పెట్టాలని రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛను, సంస్కృతులను కాపాడే సమాజం కోసం తెలంగాణలో కొత్త రాజకీయ వ్యవస్థ కోసం అడుగులు వేస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లే సమయం ఉండటంతో ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కేసీఆర్ దళిత బంధు పేరుతో వచ్చే ఎన్నికల కోసం వ్యూహం సిద్ధం చేసిన. దాన్ని ప్రయోగాత్మకంగా హుజూరాబాద్‌లో ప్రయోగించారు. అఫ్‌ కోర్స్.. ఎన్నికల సంఘం దాన్ని ఆపేయాలని చెప్పిందనుకోండి. కానీ.. ఆ ప్రభావం అయితే లేకుండా పోదు కదా. అందుకే మచ్చుకు కొందరికి ఇప్పటికే రూ.10లక్షల నగదు పంపిణీ, పథకాల ప్రారంభం కూడా చేశారు…అది అంత ఎన్నికలు కోసం చేసిన ప్రయత్నం మాత్రమే.

ఇదిలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్ మాత్రం టిఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేనని ఉంటుంది. తెలంగాణ మహిళా నాయకులతో నిర్వహించిన జనసేన వీరమహిళా సమావేశంలో తెలంగాణ బీజేపీ తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం తమకు లేదంటూ త్వరలోనే తెలంగాణా రాష్ట్రంలో పార్టీని బలపరిచే దిశగా అడుగులు వేస్తామని పవన్ కళ్యాణ్ తెలపటం కూడా జరిగింది.. తాజాగా ఈవైపుగా తెలంగాణ పార్టీ నాయకత్వం అడుగులు వేస్తుంది మెల్లగా ఒక్కో జిల్లాలో కమిటీలను ఏర్పాటు చేస్తూ బలోపేతం పై ప్రత్యేక శ్రద్ద పెట్టారు. ఇందులో భాగంగా దాదాపు అన్ని జిల్లాల కమిటీలను నియమిస్తూ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఇప్పుడిప్పుడే తెలంగాణలో అధికార టిఆర్ఎస్ కు పోటీగా నిలబడుతున్న పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో పార్టీలో కీలక మార్పులు తేనున్నారు.

తెలంగాణ రాష్ట్ర విభజన తొలిరోజుల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితులు ఉన్న నేపథ్యంలో నాటి నుండి నేటి వరకు ఎక్కడ ప్రజా సమస్యలపై ఎక్కడ కూడా జనసేన పోరాటం ఆగలేదు. అసలు ప్రతిపక్షం గొంతు మూగబోయి నప్పుడు జనసేన నాయకులు జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ స్పూర్తితో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమస్యలు తీర్చాలంటూ ప్రజా ఉద్యమాలు చేపట్టారు. ప్రతిపక్షం సమస్యల పై పోరాటం చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జనసేన నాయకులు పలు ప్రజా సమస్యలపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.