బాబూ జగజ్జీవన్ రామ్ కు ఘననివాళులు అర్పించిన జనసేన నేత బత్తుల

  • ముఖ్యఅతిథి, ఎమ్మార్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగతో కలిసి బాబూ జగజ్జీవన్ రామ్ కాంస్య విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న బత్తుల బలరామకృష్ణ

రాజానగరం: రాజానగరం మండలం, కొండగుంటూరు గ్రామంలో.. అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని సమరం సాగించిన రాజకీయ సవ్యసాచి, అరుదైన నేత, సామాజిక విప్లవ యోధుడు, మాజీ భారత తొలి ఉపప్రధాని బాబూ జగజ్జీవన్ రామ్ కాంస్య విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఆ మహనీయునికి పూలమాలలు వేసి.. ఘన నివాళులర్పించిన రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఉభయ రాష్ట్రాల ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు అభివాదం చేసి అనంతరం వేదికపైనుండే ప్రసంగిస్తూ.. బాబూ జగజ్జీవన్ రామ్ గారిని ఆదర్శంగా తీసుకుని.. అణగారిని వర్గాల కోసం, వారి హక్కుల కోసం మరియు వికలాంగుల కోసం.. సమాజంలో ఉన్న అనేక రుగ్మతలపై వీరోచితంగా పోరాడుతూ అనేక విషయాల్లో సత్ఫలితాలు సాధిస్తున్న మందకృష్ణ మాదిగ ను ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ ప్రశంసించారు.. అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమం ఏర్పాట్లలో జనసేన కొండగుంటూరు జనసేన నేతలు భాగస్వాములు కావడం గమనార్హం. ఈ కార్యక్రమంలో భూపాలపట్నం సర్పంచ్ గుల్లింకల లోవరాజు, సీనియర్ నాయకులు అరిగెల రామకృష్ణ, జగత భద్రర రావు, ఈవ్వూరి శ్రీనివాస్, కొప్పిరెడ్డి బాబీ, పేమ్మానబోయిన వీర వెంకట రావు, అగర్తి రజినీకాంత్, పేమ్మానాబోయినా రామకృష్ణ, కోన శ్రీను, ఆరవ లక్ష్మణ్, జగత మణి, పేమ్మానబోయిన రాజ్ పణి కుమార్, పల్ల వీర బాబు, సోడసాని మనీష్ కుమార్, పాము మణికంఠ, నంద్యాల కాళీ కృష్ణ, అరిగెల సతీష్, మేడిశెట్టి సత్య జయ సాయి, సొడసాని సురేంద్ర కుమార్, సలాది రమేష్, సంపత్ నగరం వైస్ ప్రెసిడెంట్ నల్ల దుర్గాప్రసాద్, వేగిశెట్టి రాజు, బోయిడి వెంకటేష్, నాతిపాం దొరబాబు, తోట అనిల్ వాసు, రాజానగరం మండల పరిధిలో గల కొండగుంటూరు సంపత్ నగరం, పుణ్యక్షేత్రం నుంచి అధిక సంఖ్యలో జనసేన నాయకులు, జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.