జనసేన నాయకుడు సి.జి రాజశేఖర్ ముందస్తు అరెస్టు

  • ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే ముందస్తు అరెస్టులు
  • వైసీపీ ప్రభుత్వంలో ప్రశ్నించే ఏ వ్యక్తికైనా స్వేచ్ఛ స్వతంత్రం లేదా?

పత్తికొండ నియోజకవర్గం: క్రిష్ణగిరి మండలంలో చెరువులకు నీళ్లు పంపడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్న సందర్భంగా జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు సిజి రాజశేఖర్ గారిని ముందస్తుగా ఒక్కరోజు ముందు సాయంత్రం 5 గంటలకే అరెస్టు చేసి పత్తికొండ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. జనసేన పార్టీ నాయకుడు రాజశేఖర్ మాట్లాడుతూ.. మా పత్తికొండ నియోజకవర్గంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు మా పత్తికొండ నియోజకవర్గానికి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అయినప్పటికీ ఇంతవరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు, ఇచ్చిన హామీలు మరిచిపోయిన జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చాలని శాంతియుతంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది. సోమవారం సాయంత్రం 5 గంటలకు జనసేన పార్టీ నాయకుడు సిజి రాజశేఖర్ ఇంటి దగ్గరికి పత్తికొండ ఎస్సై వెంకటేశ్వర్లు కానిస్టేబుల్ ముందస్తుగానే బలవంతంగా సిజి రాజశేఖర్ ను పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతని నొక్కేయాలి అనుకోవడం ఆ ప్రజాస్వామ్యంగా తెలియజేస్తున్నాను, సూర్యుని అరిచేతతో ఎవరైనా ఆపగలరా? అలాగే ప్రజాస్వామ్యంలో పోరాడే మాలాంటి వ్యక్తులను ఎవరు ఆపలేరని, తెలియజేశారు. ఇలాగే ఈ వైసీపీ ప్రభుత్వం పోలీసు వ్యవస్థని ముందు పెట్టుకొని మాలాంటి నాయకులు భయపడితే భయపడతారు అనుకుంటున్నారా? నేటి నుంచి మా పత్తికొండ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు గురించి పాంప్లెట్లు కొట్టించి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి వ్యక్తికి తెలియజేస్తామని తెలియజేశారు.