అవనిగడ్డలో జనసేన పార్టి కార్యకర్తల సమావేశం

  • పరిశీలకులు వడ్రాణం మార్కండేయ బాబు, మండలి రాజేష్, జాని మాష్టారు

క్రిష్ణా జిల్లా మండలాలు, అవనిగడ్డ శాసనసభ మండలి బుద్ధ ప్రసాద్ ని మర్యాద పూర్వకంగా కలిసి. అభినందనలు తెలియజేసిన అవనిగడ్డ నియోజకవర్గం జనసేన పార్టి జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో బుద్ధప్రసాద్, మార్కండేయ బాబు, మండలి రాజేష్, గుడివాక శేషుబాబు, మండల అధ్యక్షులు, నియోజకవర్గ నాయకులు, యం.పి.టి.సి. సభ్యులు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఉమ్మడి కూటమి ఏర్పడిన ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందేనని అన్నారు. మనకి సమయం ఏక్కవ లేనందున అందరూ క్రింద స్థాయి వరకు చేరు విధంగా మీరందరూ కష్టపడి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అవనిగడ్డ పరిశీలకులు వడ్రాణం మార్కండేయ బాబు మాట్లాడుతూ పెద్దలు గౌరవనీయులైన శ్రీ బుద్ధప్రసాద్ గారితోటి కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. మనం అవనిగడ్డ నియోజకవర్గంలో పార్లమెంటు మరియు శాసనసభ రెండు ఏన్నికల గుర్తులు గాజుగ్లాసు గుర్తు రావటం సంతోషంగా ఉంది. ఎందుకంటే మనము తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగు మహిళలు అందరిని సమన్వయం చేస్తూ ఓటును ట్రాన్స్ ఫర్ చెయ్యటానికి జనసేన పార్టి కార్యకర్తలు కంకణబద్దులౌవ్వాలని మార్కండేయ బాబు అన్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న బుద్ధప్రసాద్ గారు సౌమ్యుడు ప్రజలమనిషి ప్రజా సమస్యలపై అవగాహన వుండిన వ్యక్తి అని అన్నారు. అలానే పార్లమెంటు సభ్యులు నా మిత్రులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారిని కూడా ఆఖండ మెజారిటీతో గెలిపించుటకు ప్రజలందరూ సహకరించాలని కోరినారు. మరోక పరిశీలకులు శ్రీ మండలి రాజేష్ మాట్లాడుతూ అనుభవజ్ఞులు, మాజి ఉపసభాపతిగా పనిచేసి అసెంబ్లీ ని గోప్పగా నడిపించిన మనిషి శ్రీ బుద్ధప్రసాద్ గారిని రాజేష్ అన్నారు. పదవి వున్నా లేకపోయినా కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో వుండే వ్యక్తి మన బుద్ధప్రసాద్ గారిని తెలిపినారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జాని మాష్టారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి తిరుగుతూ సమస్యాను నోట్ చేసుకోని మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చేరవేయగలనని అన్నారు. నేను చాలా దగ్గరగా ఆయనను చూస్తున్నాను కాబట్టి ఆయన వ్యక్తిత్వం నాకు తెలుసని జాని మాష్టారు అన్నారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు జనసేన పార్టి లో చేరినారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టి నాయకులు గుడివాక శేషుబాబు, సత్యనారాయణ, మండలం అధ్యక్షులు నాయకులు, వీరమహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *