సంగం నరేంద్రను అభినందించిన జనసేనాని

గాజువాక: జనసేన పార్టీ యువశక్తి కార్యక్రమం యూత్ కోఆర్డినేషన్ సభ్యులు సంగం నరేంద్ర కి పార్టీ ఇచ్చిన బాధ్యతను శ్రద్ధాశక్తులతో నిర్వర్తించినందుకు పవన్ కళ్యాణ్ అభినందులు తెలిపారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ ప్రతి నెల తన శాలరీ నుండి 15% సమాజ శ్రేయస్సు కొరకు జనసేన బలోపేతం గురుంచి కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ అందరిని సమానంగా చూస్తూ, కష్టాల్లో ఉన్న వారికి తన వంతు సహాయం చేయడంలో ముందున్న అలాంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ గుర్తించి అభినందిచడం మా అందరికి సంతోషంగా ఉందని, ఆయన ఇంకా ఎంతో పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా మేము అందరం కోరుకుంటున్నాం.