కడప జనసేన ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ

కడప: వినాయక చవితి సందర్భంగా స్థానిక ఎర్రముక్కపల్లి రాజీవ్ మార్గ్ ప్రక్కన ఉన్నా దుర్గా స్టూడియో పాయింట్ నందు జి.టి కుమార్ మరియు జనసేన కోర్ కమిటీ సభ్యులు పత్తి విస్సు ఆధ్వర్యంలో జనసేన పార్టీ సిద్ధాంతాలలో ఒకటైన పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక ప్రతిమలను స్థానికులకు ఎర్రముక్కపల్లి వద్ద 500 ల ప్రతిమలు ఉచిత పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కడప జనసేన ఇంచార్జ్ సుంకర శ్రీనివాస్ పాల్గొని స్థానికులకు మట్టి వినాయక స్వామి ప్రతిమలను అందజేశారు. అనంతరం పెద్ద దర్గా వద్ద కోర్ కమిటీ సభ్యులు వినయ్ ఆధ్వర్యంలో 500 ప్రతిమల ఉచిత పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా సుంకర శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలలో ఒకటైన పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అనే సిద్ధాంతాన్ని గట్టిగా కడప నగర ప్రజలకు వినిపించారు. అలాగే అందరూ కూడా మట్టి వినాయకుని పూజించి పర్యావరణాన్ని కాపాడి కడప నగరాన్ని కాలుష్య రహిత నగరంగా తమ వంతు బాధ్యతగా తోడ్పాటు అందించాలని కోరారు. నగర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన జిటి కుమార్ జనసేన కోర్ కమిటీ సభ్యులు పత్తి విస్సు వినయ్ లను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కమిటీ కార్యదర్శి సురేష్ బాబు, జిల్లా మాజీ సేవాదళ్ అధ్యక్షులు పండ్ర రంజిత్ కుమార్, కోర్ కమిటీ సభ్యులు చార్లెస్ బో రెడ్డి నాగేంద్ర స్వరూప్, జనసైనికులు స్థానికులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.