పలువురిని పరామర్శించిన జనసేన నేత పితాని

రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ శుక్రవారం ప్రమాదవశాత్తు గాయపడి కాకినాడ ప్రభుత్వ హాస్పటల్లో చికిత్స పొందుతున్న ముమ్మిడివరం నియోజకవర్గం, తానే లంక వాస్తవ్యులు కడలి ఏడుకొండలు ను పరామర్శించి వారికి 1500 ఆర్థిక సహాయం అందించారు. అనంతరం అనారోగ్యంతో కాకినాడలో బెడ్ రెస్ట్ తీసుకుంటున్న జనసేన పార్టీ నాయకులు పెమ్మడి గంగాద్రి ని పరామర్శించారు. తదనంతరం తాళ్లరేవు మండలం పాత కోరంగి గ్రామంలో అనారోగ్యంతో చికిత్స పొంది బెడ్ రెస్ట్ తీసుకుంటున్న జవ్వాది తాతాజీ ని పరామర్శించారు. మరియు ముమ్మిడివరం మండలం గేదెలంక గ్రామంలో హార్ట్ సర్జరీ చేయించుకుని బెడ్ రెస్ట్ తీసుకుంటున్న కొలిశెట్టి నాగేశ్వరరావు ను పరామర్శించారు. వీరి వెంట గుద్దటి జమ్మి, జిల్లా ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జున రావు, రాష్ట్ర సహా కార్యదర్శి జక్కం శెట్టి పండు, మండల అధ్యక్షులు అత్తిలి బాబూరావు, టేకు మోడీ త్రిమూర్తులు, చీకట్ల శ్రీను, దూడల స్వామి, మామిడిపల్లి సాయిబాబా, రాచకొండ శ్రీను, చిట్టూరి దొరబాబు, బీమాల సూరి మహేష్, చిన్నారి వెంకటరమణ, చిన్నారి వీరబాబు, నరాల రామకృష్ణ, చిన్న రాజు, బండారి సత్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.