తెలుగు సినీపరిశ్రమ సాహసి సూపర్ స్టార్ కృష్ణ

గుంటురు, తెలుగు సినీపరిశ్రమలో ఎన్నో నూతన అధ్యాయాలకు ఆద్యుడు, విభిన్న ప్రయోగాత్మక చిత్రాల్లో నటించటమే కాకుండా వాటిని నిర్మించి సాహసాలకు ప్రతిరూపంగా నిలిచిన గొప్ప సాహసి సూపర్ స్టార్ కృష్ణ అని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. మంగళవారం తెల్లవారుజామున పరమపధించిన సినీనటుడు కృష్ణకు శ్రీనివాసరావు తోటలోని జనసేన కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తేనెమనసులు ద్వారా తెలుగు సినీపరిశ్రమలో అడుగుపెట్టి గూఢచారి 117 లాంటి చిత్రాల్లో కౌబాయ్ గా, అల్లూరి సీతారామరాజు లాంటి దేశభక్తి చిత్రాల్లోనూ, కురుక్షేత్రం వంటి పౌరాణిక చిత్రాల్లోనూ నటించి దశాబ్దాలుగా కోట్లాదిమంది హృదయాల్లో కృష్ణ శాశ్వత స్థానాన్ని పొందారన్నారు. కృష్ణ ఆత్మకు సద్ఘతి ప్రాప్తి0చాలని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నామని ఆళ్ళ హరి అన్నారు. నివాళులు అర్పించిన వారిలో డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్, నగర కార్యదర్శి బందెల నవీన్, కోనేటి ప్రసాద్, కోలా అంజి, మెహబూబ్ బాషా, వడ్డె సుబ్బారావు, దాసరి రాము, పురాణం కుమార్ తదితరులు పాల్గొన్నారు.