గాంధీ మహాత్మునికి ఘన నివాళులు

రంపచోడవరం నియోజవర్గం: అడ్డతీగల హెడ్ కోటర్ లో గాంధీ జయంతి సందర్భంగా సోమవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అడ్డతీగల మండల నాయకులు కుప్పాల జయరాం, పొడుగు సాయి, సింగిరెడ్డి వెంకన్న, అప్పాజీ, మరియు చిన్నారులు సరియు, హేమంత్, సుచరిత్ మరియు తదితరులు పాల్గొన్నారు.