శ్యామ్ కూమార్ పరామర్శించిన జనసేన నాయకులు

*ప్రమాదవశాత్తు కాలు విరిగి కోలుకున్న శ్యామ్ కూమార్ పరామర్శించిన ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన నాయకులు

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలంలో వెంకటేశ్వర కాలనీలో ఉన్న పచ్చపల్లి శ్యామ్ కూమార్ కి 8రోజుల క్రితం ప్రమాద వశాత్తు కాలు విరగడం జరిగింది. విషయం తెలుసుకొన్న ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన నాయకులు శ్యామ్ కూమార్ ను పరామర్శించి.. ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకుని.. అతనికి అన్నివిధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గం టీమ్ జి.సిగడాం మండలం జనసేన జెడ్పిటిసి అభ్యర్ధి అర్జున్ భూపతి, లావేరు మండలం పైడియ్యవలస జనసేన ఎంపీటీసీ వడ్డిపల్లి శ్రీనువాసరావు, అప్పాపురం జనసేన ఎంపీటీసీ అప్పలరాజు, జనసేన నాయకులు బోంతు విజయకృష్ణ, రణస్థలం మండలం జనసేన ఎంపీటీసీ దన్నాన చిరంజీవి, రణస్థలం గ్రామ పంచాయతీ జనసేన ఎంపీటీసీ సువ్వాడ రామారావు, కృష్ణాపురం పంచాయతీ ఎంపీటీసీ పోట్నూరు లక్ష్మునాయుడు, జనసైనుకులు చిన్న తదితరులు పాల్గొన్నారు.