కృష్ణపట్నం పోర్టుకి అనుకొని ఉన్న బీచ్ ని సందర్శించిన జనసేన నాయకులు

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు గురువారం ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం పోర్టుకి అనుకొని ఉన్న బీచ్ ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో రెండు మండలాలు సముద్ర తీరానికి అనుకుని ఉన్నాయి. వాటిలో తోటపల్లి గూడూరు మండలం కొత్తకోడూరు బీచ్, ముత్తుకూరు మండలం కృష్ణపట్నం బీచ్. ఇవి రెండు కూడా పర్యాటక రంగానికి సంబంధించినవి. అయితే కొత్తకోడూరు బీచ్ కి పూర్తిస్థాయిలో రోడ్డు నిర్మాణం లేదు. అదే విధంగా ముత్తుకూరు మండలంలో కృష్ణపట్నం పోర్టుకి అనుకొని ఉన్నటువంటి కృష్ణపట్నం బీచ్ ఏదైతే ఉందో ఇది చెన్నైలోని మెరీనా బీచ్ ఏ విధంగా ఉంటుందో అదే విధమైనటువంటి వాతావరణాన్ని కూడా అందించే విధంగా ఈ బీచ్ ఉంది. అయితే పర్యాటకశాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజా పర్యాటక శాఖని అభివృద్ధి చేయమని చెప్పి పదవి ఇస్తే మరి ఆ మంత్రి పదవిని పక్కన పెట్టేసి మరి ఆమె బాధ్యతలను కూడా పూర్తిగా గాలికి వదిలేసి మీరు పర్యటించడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నట్టున్నారు. దయచేసి రోజమ్మా మీరు పర్యాటక శాఖ మీద దృష్టి పెట్టాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా మీరు లేస్తే మా అధినేత పవన్ కళ్యాణ్ ని దూషించడం జనసైనికులని కించపరిచే విధంగా మాట్లాడడం మానుకొని మీరు మీకిచ్చినటువంటి పర్యాటక శాఖని, ఆ శాఖ యొక్క ఉద్దేశం, మరియు ఆ శాఖకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడ అభివృద్ధి చేయాలి అనే దాని పైన దృష్టి పెట్టాలని మిమ్మల్ని కోరుతున్నాం. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గం అంటే వ్యవసాయ శాఖ మంత్రి నియోజకవర్గం అందులో కూడా కృష్ణపట్నం పోర్టు ఈ పోర్టుకు అనుకొని ఉన్నటువంటి బీచ్ ఈ బీచ్ కి సరైన రోడ్డు నిర్మాణం లేదు, అదే విధంగా బీచ్ ని అభివృద్ధి చేయండి దీనివల్ల పర్యటకులు వచ్చేదానికి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది కాబట్టి దయచేసి విమర్శలను పక్కనపెట్టి మీరు ముత్తుకూరు కృష్ణపట్నం బీచ్ ని అభివృద్ధి చేయాలని మేము మీడియా పూర్వకంగా కోరుతా ఉన్నాం ముందు మీకిచ్చిన శాఖకి న్యాయం చేసి తర్వాత మా మీద మా అధినేత మీద విరుచుకుపడవచ్చు అప్పుడు మేము మీకు దీటుగా సమాధానం చెప్పడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. దయచేసి మీకు ఇచ్చినటువంటి పర్యాటక మంత్రి పదవి మిమ్మల్ని పర్యటించమని చెప్పి కాదు బోట్ షికారులు చేయమని కాదు ప్రజలకి అనువుగా ఆహ్లాదకరమైన ఏరియాలని డెవలప్ చేయమని చెప్పి అందులో భాగంగా మా నియోజకవర్గంలో కూడా అటువంటి అహ్లాదకరమైన వాతావరణ ఇచ్చేటువంటి బీచ్ ఉంది కాబట్టి దయచేసి అభివృద్ధి చేయమని కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రహీం, నాసిన శీను, శ్రీహరి, సందీప్, నడవల సుమన్, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.