కౌలు రైతు మధుకర్ కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నేతలు

  • కష్టం కౌలు రైతుదే నష్టం కూడా కౌలు రైతుదే చివరికి ఆత్మహత్య చేసుకునేది కౌలు రైతే

హుస్నాబాద్ నియోజకవర్గం: తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని ఆదుకొనే వారు ఎవరు?. రైతు బంధు, రైతు భీమా వర్తించదు. పంట భీమా చెయ్యడం మానేశారు ప్రభుత్వ పాలకులు!.. ఇక ఎవ్వరికీ చెప్పుకోవాలి ఆ కౌలురైతు కష్టం. మూడు చొప్పున వడ్డీలకు అప్పు తెచ్చి నాలుగు ఏకారాలు కౌలు కు తీసుకొని నాలుగు యేండ్ల ఏడు నెలల కాలంలో 5 పంటలు చేతికి రాకపోగా చేసిన అప్పుకు వడ్డీలు పెరిగి గత రెండు సంవత్సరాలుగా ముగ్గురు కుటుంబ పెద్దల చావు చూసిన ఆ కౌలు రైతు అవమాన భారంతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు పేరు పెండ్యాల కొమురయ్య కుమారుడు పెండ్యాల మధుకర్ హుస్నాబాద్ నియోజకవర్గం, ఏల్కతుర్తి మండలం గోపాల్ పూర్ గ్రామ వాస్తవ్యులు బ్యాంక్ రుణాలు ఇవ్వదు, ప్రభుత్వం అసరా ఇవ్వదు అప్పులు ఇచ్చిన వాళ్ళు వడ్డీలకు ఆగరు. నష్టం వచ్చిందంటే అసలుకు కూడా ఆగరు. చిద్రమైన కుటుంబం రేపటి రోజు తిండి కూడా లేని పరిస్థితి. తనది కాని భూమిలో రెక్కల కష్టం చేసి ఫలం కోసం ఆకాశం వైపు చూసే ఆశాజీవి కౌలు రైతు కష్టం చేస్తూ అప్పు తెచ్చి బాధ్యతతో వ్యవసాయం చేస్తే విధి, ప్రకృతి కన్నెర్ర చేస్తే భూమి సొంతదారు దయ మీద బతకాల్సిన పరిస్థితి.. ప్రకృతిని నమ్ముకునే నిజమైన జీత బత్యాలు లేని ఉద్యోగి కౌలురైతు. రైతు రుణ మాఫీ, బంధు, సంక్షేమ పథకం అనుభవించలేని బాధ్యత గలిగిన భారతీయుడు కౌలు రైతు. పుట్రు, నకిలీ విత్తనాలు, సారం లేని ఎరువులు అందిస్తున్న ప్రభుత్వ పాలకుల చేత మోసపోతున్న మొదటి భారతీయుడు ఈ కౌలు రైతు. ఆ ఆరు లక్షల ఎనబై వేల అప్పు తీర్చలేక చనిపోయిన ఆ కౌళురైతు కుటుంబానికి ఆసరా ఎవరు? ప్రభుత్వ పాలకులు పూర్తి బాధ్యత వహించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆజ్ఞాపిస్తూ ఆ పిల్లల చదువుల బాధ్యత ప్రభుత్వమే తీసుకొని బాధ్యత వహించాలని తెలంగాణ రాష్ట్ర జనసేన నాయకులు మరియు తెలంగాణ రాష్ట్ర కిసాన్ ఫోరమ్ గౌరవ అధ్యక్షులు చిట్టి ఉదయ్ కుమార్ రెడ్డి ఈ నియోజక వర్గ ఎం ఎల్ ఏ గారిని, గౌరవ ముఖ్యమంత్రికి విషయం తెలుపుటకు పత్రికా ముఖంగా తెలియజేయడం జరిగింది. నేను రైతును తప్పు పట్టడం లేదు రైతు వ్యవస్థ పై జరుగుతున్న అవినీతి పాలన ను తప్పు పడుతున్న. ఈ మన దేశంలో రైతు కూడా సెలవు తీసుకొనే రోజు కోసం ఎదురుచూస్తూ ఉన్న రైతు బిడ్డను.. తన పంటకు తానే విలువను నిర్ణయించే స్థాయికి ఎదగాలని చిట్టి ఉదయ్ కుమార్ రెడ్డి కోరుతున్నారు.