వెజ్జు సత్యకు మనోధైర్యాన్నిచ్చిన జనసేన నాయకులు

పోలవరం నియోజకవర్గం, టీ నర్సాపురం మండలం, బండివారిగూడెం గ్రామంలో వెజ్జు సత్య (ఎన్నారై) తండ్రి వెజ్జు గోపాలరావు అనారోగ్యం కారణంగా స్వర్గస్తులయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి గారు పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ చిర్రి బాలరాజు గారు. బండివారిగూడెం చేరుకొని సత్య (ఎన్నారై)కి మనోధైర్యాన్ని ఇచ్చి వారితండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.