విడుదలైన జనసేన నాయకులు

  • జనసేనానిని కలుసుకున్న జనసేన నాయకులు

విశాఖపట్నం ఈస్ట్ సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ నుండి విడుదలయి నోవాటెల్ లో ఉన్న జనసేన పార్టీ అధ్యక్షుల వారిని కలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు పంతం నానాజీ, చిలకం మధుసూదన్ రెడ్డి, శెట్టిబత్తుల రాజబాబు, షేక్ రియాజ్, బండ్రెడ్డి రామ్, బొమ్మిడి నాయకర్, పసుపులేటి హరిప్రసాద్, నాయబ్ కమాల్, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తదితర నాయకులు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. విశాఖ పొలీసులు అక్రమ కేసులు నమోదు చేసి పార్టీ నాయకులతో పాటు, పార్టీ కార్యకర్తలు, వీర మహిళలను అదుపులోకి తీసుకున్న అంశాలపై సమీక్షించారు. అరెస్టయిన వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు, స్టేషన్లలో ఉన్నవారికి అవసరం అయిన మెడికల్ ఎయిడ్, ఆహారం సక్రమంగా అందించే బాధ్యతను తీసుకోవాలని నాయకులకి సూచించారు. కేసులు ఎదుర్కొంటున్న వారికి న్యాయపరమైన సహాయం అందించే బాధ్యతను పార్టీ చేపట్టిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. సీనియర్ లాయర్లతో చర్చించామని చెప్పారు.