ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు ఆర్ధికసాయమందించిన మేడ గురుదత్ ప్రసాద్

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన కళాకారులు బృందం ప్రమాద ఘటనలో చనిపోయిన బిశెట్టి వీరబాబు, సూరిశెట్టి దుర్గా, ఆడారి బుల్లయ్య కుటుంబాలకు అండగా రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ ఆర్థిక సహాయంతో ఒక్కొక్క కుటుంబానికి 10,000₹ రూపాయల చొప్పున 30,000₹ రూపాయలు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంట స్వరూప దేవి మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి మైరెడ్డి గంగాధర్ ల చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజానగరం మండల కన్వీనర్ బత్తిన వెంకన్న దొర సీతానగరం మండల కన్వీనర్ కారిచర్ల విజయ్ శంకర్ చదువు ముక్తేశ్వరరావు మరియు శ్రీరంగపట్నం జనసైనికులు తన్నీరు తాతజీ, అడపా అంజి, దొడ్డి అప్పలరాజు, భానుశంకర్, అతికింశెట్టి శ్రీను, చలపతి జాన్ ప్రసాద్ పాల్గొన్నారు.