నెల్లిమర్లలో పర్యటించిన జనసేన నాయకులు

నెల్లిమర్ల, డబ్బులు తిన్న ప్రజా ప్రతినిధులు ప్రజలను గాలికి వదిలేసారు. బాధితుల తరఫున పోరాటం చేస్తోంది జనసేన వివరాల్లోకెళ్తే విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం భాగాపురం మండలంలోని ముసలిపేట బరెడ్డిపాలెం పంచాయతీ, డల్లు పేట పంచాయతీ, బొనంకెలపాలెం గోడపువలస పంచాయతీ, రిల్లి పేట కౌలువాడ వాడ పంచాయతీ, మరడపాలెం గ్రామం ఎయిర్ పోర్ట్ కు సంబంధించి భూముల విషయంలో నెల్లిమర్ల జనసేన టీం పర్యటన చేయడం జరిగింది. పర్యటనలో భాగంగా కొంతమంది బాధితులు నష్టపరిహారం చెల్లించకుండా మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమని బెదిరిస్తున్నారని బాధపడ్డారు. అలాగే జిల్లా కలెక్టర్ స్పందించి రెండు నెలలు టైం ఇచ్చారని కానీ రెండు నెలల్లో కాళీ చేయలేమని ఇల్లును రెడీ అయ్యేసరికి ఇంకా ఆరు నెలలు పడుతుందని తెలిపారు పరిహారం పూర్తిగా చెల్లించకుండానే పిల్ల జల్లాతో ఎక్కడికి పోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లిమర్ల నియోజకవర్గ సీనియర్ నాయకులు బుర్లే విజయ్ శంకర్, దిండి రామారావు, పతివాడ అచుము నాయుడు, తోత్తడి ప్రకాష్, పిన్నింటి రాజారావు, లింగం రమేష్, బుజ్జి, అప్పలరాజు, రామారావు ఉత్తరాంద్ర మహిళా రిజనల్ కో ఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీ రాజ్ మరియు ముఖ్య నాయకులు పర్యటించడం జరిగింది.