గాడాల గ్రామంలో జనం కోసం జనసేన మహాపాదయాత్ర

  • ఇంతటి ఆదరణ, ఆప్యాయత ఒక్క జనసేన పార్టీకి మాత్రమే సొంతం
  • అడుగడుగున మహిళల హారతులతో ప్రజానీకం జనసేన పార్టీకి బ్రహ్మరథం పట్టేలా సుదీర్ఘంగా ముందుకు సాగుతున్న మహాపాదయాత్ర!
  • జనసేన వీరుల సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో ఈ అవినీతి వైసీపీ వారికి రుచి చూపిస్తాం!
  • జనసేన పార్టీ తోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు!
  • రాష్ట్రం మనది.. భవిత మనది.. రాష్ట్ర అభివృద్ధికి జనసేన పార్టీ తరపున మన వంతు కృషిని నిబద్ధతతో చేద్దాం

రాజానగరం: గాడాల గ్రామంలో ఉదృతంగా కొనసాగుతున్న’జనం కోసం జనసేన’ ‘మహా పాదయాత్ర’లో మన ప్రియతమ నాయకురాలు నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ బత్తుల బలరామకృష్ణ నాయకత్వాన్ని బలపరిచి.. పవన్ కళ్యాణ్ గారి ప్రజా పరిపాలన తీసుకురావాలని తెలియజేశారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీకి ఒక అవకాశం ఇచ్చి ప్రజా పరిపాలన తీసుకురావాలని కోరిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో గాడాల జనసేన సీనియర్ నాయకులు అడ్డాల శ్రీను, అడ్డాల శివ సూర్య చక్రవర్తి, గాదంశెట్టి వెంకన్న, మణ్యం శ్రీను, పడాల అనీష్, మాదారపు శ్రీనివాస్ (ఆలి), మాగాపు నాగేశ్వరరావు, మాగాపు సత్యనారాయణ, కన్నెం శ్రీను, బంటుపల్లి ఏసు, మట్ట గణేష్, అత్తిలి గోపి, నార్ని నారాయణరావు, గాడాల జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, మండల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.