కాపవరంలో జనం కోసం జనసేన మహాపాదయాత్ర

  • కాపవరం గ్రామంలో ఉదృతంగా సాగిన పాదయాత్ర
  • మహిళా సాధికార కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారికి హారతులతో ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు

రాజానగరం: కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో జనం కోసం జనసేన మహాపాదయాత్రలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ మహిళా సాధికార కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ముందుగా గ్రామంలో ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని దర్శించి అనంతరం అక్కడి నుండి పాదయాత్రగా బయలుదేరి గ్రామంలో ప్రతీ ఇంటికీ తిరుగుతూ ప్రతీ ఒక్కరినీ పలకరిస్తూ వారి కష్టాలు తెలుసుకుంటూ ఈ దుష్ట పరిపాలనను అంతమొందించి రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీని గెలిపించుకుని మన జీవితాలలో వెలుగులు నింపుకుందాం అని తెలియజేస్తూ జనసేన పార్టీ కరపత్రం, కీ చైన్, బ్యాడ్జ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండల నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు.