ఆమదాలవలస నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన సమావేశం

ఆమదాలవలస, రాబోయే మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని జనసే నాయకులు, కార్యకర్తలు, జనసైనికులకు మంగళవారం సాయంత్రం ఆమదాలవలస నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జీ పేడాడ రామ్మోహన్ రావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో అన్ని చోట్లా జనసేన పార్టీ పోటీ చేస్తుందని, దీని కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.