ఓటరు నమోదు అధికారితో జనసేన సమావేశం

శృంగవరపుకోట నియోజకవర్గ రాజకీయ పార్టీ నాయకులతో ఓటరు నమోదు అధికారి మరియు ప్రత్యేక ఉప కలెక్టర్ బి. పద్మావతి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో బి.పద్మావతి మాట్లాడుతూ, ఓటరు కార్డ్ కు ఆధార్ అనుసంధానం తప్పనిసరిగా చేయుంచుకోవాలని, దీనిపై ఆవాగాహన కల్పించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పారు. రాబోయే ఎన్నికలకు పోలింగ్ బూతులు గత ఎన్నికల్లో నిర్వహించిన పోలింగ్ బూత్ స్టేషన్ల భవనాలు శిథిలావస్థకు చేరడంతో కొన్ని పోలింగ్ బూతులు మార్పులు చేయడం జరిగిందని వీటిపై పలు సందేహాలు ఉన్నచో అభిప్రాయాలు, సలహాలు, సూచనలు అన్ని పార్టీ నాయకులు అందించవచ్చని తెలుపుతూ ఫారం 6, 7, 8, అంటే ఓటరుగా నమోదు, తొలగింపు, సవరణ, బదిలీ వివిధ అంశాలపై ఆవాహన కల్పిస్తూ, మీరుకూడా ఎన్నికలకు సంబంధించి ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేసే బాధ్యత వహిస్తూ, సహకరించాలని తెలియజేసారు. ఓటు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరి ఉపయోగించుకునేలా తమ సిబ్బంది నిరంతరం కృషి చేస్తామని. ఈ అవకాశాన్ని యువత మరియు జిల్లాలో నియోజకవర్గ పరిధిలో ఓటు హక్కులేని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మీడియా ముఖంగా సందేశాన్ని ఇచ్చారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు తమ అభిప్రాయాలను తెలియజేసారు.