బోరింగ్ ఏర్పాటుకు కృషిచేసిన జనసేన నరేంద్ర

  • జనం కోసం జనసేన

పాత గోపాలపట్నం, 91వ వార్డ్, ఎస్సీ కాలనీలో చాలా రోజులు క్రితం బోరింగ్ ని ఎవరికీ చెప్పకుండా అమానుషంగా మున్సిపాలిటీ వారు తీసుకువెళ్లడంతో అక్కడ ప్రజలు నీటికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని పెద్దలు అందరికి చెప్పిన ఎవరు పట్టించుకోకపోవడంతో.. స్థానికంగా అక్కడ నివసిస్తున్న అప్పలరాజు మరియు మహిళలు జనసేన నరేంద్రకి విష్యం చెప్పడం జరిగింది… వెంటనే నరేంద్ర స్పందించి సచివాలయం సిబ్బందితో, మున్సిపాలిటీ సిబ్బందితో మాట్లాడి అక్కడ వెంటనే బోరింగ్ వచ్చేలా ఏర్పాటు చేసినందుకు జనసేనకు మరియు నరేంద్ర కి అక్కడి ప్రజలు వారికి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుకున్నారు.