ఆపన్న హస్తమందించే అమృత హృదయం జనసేన సొంతం

  • జనసేన అంటే ఒక భరోసా..
  • జనసేన అంటే ఒక భవిష్యత్తు..
  • బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి జనసేన మాత్రమే..
  • ఆపన్న హస్తమందించే అమృత హృదయం జనసేన సొంతం!
  • రండి!, జనసేనలో చేరుదాం!, ప్రగతి రధం ఎక్కుదాం!

సత్తెనపల్లి రూరల్ మండలం, గోరంట్ల గ్రామం నాయీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన పుల్లచెరువు పుల్లయ్య తీవ్రమైన అనారోగ్యంతో సత్తెనపల్లి జనసేనపార్టీ కార్యాలయాన్ని సంప్రదించిన విషయాన్ని పార్టీ శ్రేణులు స్థానిక జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు బొర్ర వెంకట అప్పారావు ధృష్ఠికి తీసుకెళ్ళగా, వెంటనే వారికి ఆర్ధిక సహాయాన్ని అందించారు. ఈ ఉదంతంతో జనసేన పార్టీ కార్యాలయం అంటే పౌరసేవాకేంద్రమని మరోసారి ఋజువైంది, ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కోమ్మిశెట్టి సాంబశివరావు, మున్సిపల్ 7వార్డు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, సత్తెనపల్లి రూలర్ మండల అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.