ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్- జనసేన విజయ యాత్ర 35వ రోజు

త్రాగడానికి నీళ్లు ఇవ్వండి!! రేణిగుంట ప్రజల కన్నీటి ఆవేదన!!

35వ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇంటింటికీ ప్రచారం

శ్రీకాళహస్తి నియోజకవర్గం: రేణిగుంట పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ వీదిలో గురువారం ఇంటింటికీ ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవశ్యకతను వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మదు సుధన్ రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలను, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని కోరడం జరిగింది. నీటి సమస్యతో ఇక్కట్లు పడుతున్నట్టు మహిళలు తెలిపారు. 15 రోజులకి ఒకసారి నీళ్లు వదిలితే ఎలా చెయ్యాలి అని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కాలువలు నెలల కొద్దీ గడుస్తున్నా శుభ్రం చెయ్యట్లేదని ఆక్రోశం వెళ్ళబోసారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ గారిని కలుస్తామని ప్రజలకు వినుత హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రేణిగుంట పట్టణ ఇంఛార్జి భాగ్య లక్ష్మి, మండల ఇంఛార్జి చిన్న తోటి నాగరాజు, ఉపాధ్యక్షులు వాకాటి బాలాజీ, నాయకులు నగరం భాస్కర బాబు శ్రీనివాసులు, శంకర్, శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య, నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.